Examity Process Associate Jobs 2025 :
Hi Friends Meazure Learning కింద పనిచేస్తున్న Examity వాళ్లు ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం interview ద్వారా ఎంపిక చేసి ఈ మార్చ్ 28th వరకు Process Associate ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి
Examity Company Details :
- ఈ Examity అనేది Meazure Learning లో భాగం, వీళ్లు విద్యా సంస్థల మరియు ధృవీకరణ ప్రొవైడర్ల కోసం ఆన్‌లైన్ ప్రొక్టరింగ్ పరిష్కారాలలో ప్రత్యేకత కలిగిన సంస్థ.
- వీళ్లు ముఖ్యంగా ఆన్‌లైన్ పరీక్షలు మరియు ధృవపత్రాల సమగ్రతను నిర్వహించడం లాంటి పనులు చేస్తారు.
- ఈ Examity వాళ్లు పరీక్ష టేకర్స్ మరియు క్లయింట్లు రెండింటికీ సున్నితమైన మరియు సురక్షితమైన అనుభవాన్ని నిర్ధారించడానికి పరీక్ష చాట్, ఫోన్ మరియు ఇమెయిల్ ద్వారా 24/7 మద్దతును అందిస్తారు.
- ఈ ఎక్సమిటీ సెప్టెంబర్ 6, 2023 న Meazure Learning లో అనుసంధానం అయ్యారు.
- So ఈ Examity అనేది online proctoring solutions లో మంచిగా అభివృద్ధి చెందుతున్న సంస్థ కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాల్ని వదులుకోకండి.
Job Role :
- మీరు ఒక ప్రొక్టర్ గా పరీక్షలు మరియు ఇతర పరీక్షలు, వాస్తవంగా; ప్రతి క్లయింట్ల పరీక్షా నియమాలకు అనుగుణంగా “స్టార్ట్-అప్”, సమర్పణ మరియు పరీక్ష టేకర్స్ పరీక్షలో లాగ్-అవుట్ ఉన్నాయా లేదా అని చూస్తూ ఉండాలి.
- ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో, ఆడియో లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా పరీక్షా ప్రక్రియలో సంభవించే డిస్‌కనెక్ట్ సమస్యల రిజల్యూషన్‌ను నిర్ధారించడానికి ఆపరేషన్స్ STA మరియు పరీక్ష రాసేవారి మధ్య అనుసంధానంగా పనిచేయాలి.
- అవసరమైన డాక్యుమెంటేషన్‌తో పరీక్ష రాసేవారిని ఇంటర్వ్యూ చేయాలి.
- పరీక్ష సమయంలో సాంకేతిక సమస్యలను సాంకేతిక మద్దతు బృందానికి నివేదించాలి.
- చాట్ మరియు ఇమెయిల్ మద్దతుతో సహా వ్యాపారం అందించిన కస్టమర్ సపోర్ట్ సాధనాన్ని ఉపయోగించడం ద్వారా పరీక్ష రాసేవారు మరియు ఖాతాదారులకు అద్భుతమైన కస్టమర్ సేవను అందించాలి.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక కంపెని వల్లే మీ ఉద్యోగం ఎలా ఉంటుంది ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/ Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీకు వున్న చదువు, అర్హత మరియు అనుభవాన్ని బట్టి నెలకి 30 వేల జీతం ఇస్తారు.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలి.
- ఈ ఉద్యోగాలు మీకు work from office ఉంటాయి, మన హైదరాబాద్ హైటెక్ సిటీ లో వీళ్ళ ఆఫీస్ ఉంటది అక్కడకి వెళ్లి మీరు పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు మరియు వచ్చేటప్పుడు Cab సదుపాయాన్ని కంపెనీ వాళ్లే మీకు అందిస్తారు కాబట్టి ఈ మనిషి అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
- ఇంటర్వ్యూ సమయం — 27th March మరియు 28th March రోజు ఉదయం 10AM నుంచి మధ్యాహ్నం 3PM వారికి పెడతారు.
- ఇంటర్వ్యూ వేదిక — 2nd Floor, My Home Twitza Building Hitech City Main Rd, Diamond Hills, Hyderabad, Telangana 500081 (View on map).
- ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్న ఇక్కడ ఇచ్చిన HR Number – 9121165479 ని సంప్రదించండి.
మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవి
- Updated Resume
- విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
- ఆధార్ కార్డు ( Orginal )
- Passport size photos మరియూ
- పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి
So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Examity సంస్థ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటుంది మరియు మీరు ఎంపికఅయ్యాక మన హైదరాబాద్ Hitech City లో పని చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
హైదరాబాద్లో Firstsource లో Customer Support Executive ఉద్యోగ అవకాశాలు – ఇప్పుడే Apply చేయండి!
Pingback: Axis Bank Mega Walk-In Drive 2025 - హైదరాబాద్లో ఉద్యోగ అవకాశం! - jobalert-247.in